తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ మండలం శివానగర్లోని వికలాంగుల కాలనీలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రూ. 21 లక్షల నగదుతో మహాలక్ష్మి అవతారంలో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ