తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో రేగళ్ల గుత్తికోయ గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ జి.నరేందర్ పాల్గొన్నారు.మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ గ్రామంలో ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.అనంతరం గ్రామస్తులందరితో సమావేశమై అక్కడ నివసించే చిన్న పిల్లలకు పలకలు,పుస్తకాలతో పాటు, మహిళలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.అదేవిధంగా గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్లను కూడా అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఓఎస్డి గారు మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి సారధ్యంలో ఆదివాసీ ప్రజలకు విద్య,వైద్యం,రవాణా వంటి కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని,అదేవిధంగా నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని గ్రామస్తులకు సూచించారు.గ్రామంలోని పొలం పనులకు వెళ్లే మహిళలకు వర్షాకాలం ఇబ్బంది కలగకుండా ప్లాస్టిక్ రైన్ కోట్స్ ను అందించారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు,కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు,పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ