తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం , చుంచుపల్లి మండలం, శ్రీరామ ఫంక్షన్ హాల్ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి ముందు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంను ప్రారంభించి, పార్టీ జండాను ఆవిష్కరించారు అనంతరం కొత్తగూడెం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టి, అమరవీరుల స్థూపానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రాం తాళ్ళురి, జనసేన పార్టీ ఇంచార్జి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి సాగర్, మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు తదితరులు సమక్షంలో 200 మంది యువకులు, మహిళలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేను జనసేన పార్టిలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.. నేను ఈ కొత్తగూడెం లోనే పుట్టి పెరిగిన మీ మనిషి ని నేను ప్రజా సేవ చేయడానికి ఈ పార్టీ లో చేరాను.. ఈ జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ కు ప్రజలకు ఏమీచేయాలో తెలిసిన నిబద్ధత కలిగిన నాయకుడని, సిద్దాంతాలు కలిగిన నాయకత్వం లో పని చేసేందుకు ముందుకు వచ్చాను.. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం లో పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది.. గత ప్రభుత్వం లోని బిఆర్ఎస్ పార్టీ కానీ, ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదు.. అందుకే ఓ బలమైన రాజకీయ పార్టీగా రానున్న రోజుల్లో మీ సహకారం తో తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లో పోటీ చేసే.. గెలిచి పైకి ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ళ్లూరు మాట్లాడుతూ శ్రీరాముడు ఆశీస్సులతో జిల్లాలో సేవ చేసే భాగ్యం కలిగించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానన్నారు సామాజిక తెలంగాణ జనసేన పార్టీతోనే సాధ్యమని, బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన పార్టీకి తాము మొదటగా ఉంటామని, బారాస పార్టీ దళిత ముఖ్యమంత్రి వాగ్దానం ల మాటలుగా మార్చమని, ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థి అయినప్పుడే తెలంగాణలో సామాజిక తెలంగాణ వస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి, జనసేన రాష్ట్ర అధ్యక్షులు శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రాము యాదవ్,ప్రచార కార్యదర్శి ఆర్.కె. సాగర్, టీ. శ్రీనివాసరావు, సినీనటుడు తనీష్, హసీనా,జయశ్రీ, ఖమ్మం జిల్లా ఇన్చార్జి మిర్యాల రామకృష్ణ, కట్టా రామకృష్ణ ఆళ్ల నరేష్, ఉసికల రమేష్ సాదిక్ , తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలోభారీగా పాల్గొన్న జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు.
Admin
తెలుగు వెలుగు టీవీ