Sunday, 26 July 2026 11:33:23 PM
# ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం. # ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. # కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి.ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # సింగరేణి సంస్థలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు . # మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేయాలి. జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనీనా. # బోరు బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండాలి – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు . # యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్. # అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి - మేయర్ మూడ్ గణేష్. # స్త్రీ నిధి రుణాల రికవరీకి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ప్రతి విద్యాసంస్థలోని యువతను మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయాలి... అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణు గోపాల్. # ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీర స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో నిరసన. # సర్ ప్రోగ్రాం లో భాగంగా జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే # ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి . # జూలూరుపాడు బంగారం షాపులో ఘరానా మోసం . # రెండు వర్గాల మధ్య ఘర్షణ ఘటన – ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ చర్యలు.

విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వ పతనం తప్పదు

Date : 23 July 2026 03:26 PM Views : 28

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : - చదువులను నాశనం చేస్తున్న పాలకులు - విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి - ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి - ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ - కలెక్టరేట్ ముట్టడి విజయవంతం రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ విమర్శించారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ, ప్రభుత్వ విద్యను బలహీనపరిచే విధానాలను కొనసాగిస్తే విద్యార్థుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, "విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వ పతనం తప్పదు" అని హెచ్చరించారు. విద్యారంగ సమస్యల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి విజయవంతమైంది. వేలాదిమంది విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఒకానొక దశలు కలెక్టరేట్ ముక్క ద్వారా గేటును తోసుకుంటూ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఏఐఎస్ఎఫ్ జండాలు పట్టుకొని పలువురు విద్యార్థులు గేట్లు ఎక్కి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రోజురోజుకూ సంక్షోభంలోకి నెట్టబడుతోందని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల కొరత, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల లేమి కారణంగా నాణ్యమైన విద్య దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వెంటనే పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా రంగానికి దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు తెలంగాణలో ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఫీజులపై ప్రభుత్వం కఠిన నియంత్రణ తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో సమర్థవంతంగా అమలు చేయాలని, పెద్ద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యా రంగాన్ని గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అజిత్ డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏవో కృష్ణ ప్రసాద్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలోఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శిలు ఇనపల్లి పవన్ సాయి గుండల సుజన్ మాణిక్యాల వినయ్ గుగులోత్ వంశీ జిల్లా ఉపాధ్యక్షులు అక్కినపల్లి నాగేంద్రబాబు కొరిమీ సంజయ్

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :