తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో ఇటీవల ప్రారంభించిన రాయల్ స్పైసీ హోటల్ ను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ నాయక్ తదితర ప్రముఖులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ నాయకులు దిండిగల రాజేందర్, కాపు సీతామహాలక్ష్మీ తదితర ప్రముఖులతో పాటు భోజనం చేసి హోటల్ యజమానులు నవతన్, శివమూర్తిలకు శుభాభినందనలు తెలిపి ఆశీర్వదించారు. ఇదేవిధంగా శుచి, శుభ్రత, నాణ్యతను కొనసాగిస్తూ హోటల్ అందరి ప్రశంసలు అందుకోవాలని, యాజమాన్యం ఆర్థికంగా బలపడాలని ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధు తదితర ప్రముఖులు ఆకాంక్షించారు, దీవించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ