తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నర్సింహస్వామి జయంతి సందర్బంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు పాల్వంచ కెఎస్ఎం వద్ద నర్సింహస్వామి గుడిలో ఘనంగా కొనసాగాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్బంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ పట్టణ అధ్యక్షులు జయప్రకాష్,ప్రముఖులు గోపు నరేష్,శశియాదవ్,ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ