Tuesday, 28 July 2026 04:22:39 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజనను సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 06 April 2026 04:40 PM Views : 209

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజన పథకంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజనను జిల్లాలో అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా ఇళ్ల పైభాగంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని, స్వయం విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు. సోలార్ విద్యుత్ వినియోగం పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు . అదనంగా, వినియోగించని విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి తిరిగి ఆదాయం పొందే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఒక కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం లక్ష్యమని వెల్లడించారు సబ్సిడీ వివరాలను తెలియజేస్తూ, 2 కిలోవాట్ వరకు ప్రతి కిలోవాట్‌కు రూ.30,000, 3 కిలోవాట్ మరియు అంతకంటే ఎక్కువ సామర్థ్యంపై అదనంగా రూ.18,000 సబ్సిడీ అందించబడుతుందని తెలిపారు. పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, విద్యుత్ బిల్, బ్యాంక్ పాస్‌బుక్, ఫోటో అవసరమని తెలిపారు. అర్హులైన వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్ pmsuryaghar.gov.in లో నమోదు చేసుకుని రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, కస్టమర్ నంబర్ తదితర వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్సీ జి. మహేందర్, టీజీఆర్‌ఈడీసీఓ జిల్లా మేనేజర్ పి. అజయ్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :