తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ నెల 19 వ తేదీన శ్రీ రామాచంద్ర డిగ్రీ కాలేజీ కొత్తగూడెం నందు గల రై ఫెల్ షూటింగ్ రేంజ్ లో అండర్ 14,17,19 సంవత్సరముల ఉమ్మడి ఖమ్మం జిల్లా బాలబాలికల రైఫిల్ షూటింగ్ జట్లు ఎంపికలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్ 14,17,19 బాల,బాలికల రైఫిల్ షూటింగ్ ఎంపికలు అక్టోబర్ 19 ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా సెలెక్షన్స్ నిర్వహించనున్నారని, ఉమ్మడి ఖమ్మం జిల్లా ల విద్యాశాఖాధికారులు . ,A.C.L.B P.. శ్రీజ, బి నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 14 క్రీడాకారులు 6వ తరగతి నుండి ఆ పైన చదువుతూ (01.01.20012) తరువాత జన్మించిన వారై ఉండాలి, అండర్ 17 క్రీడాకారులు01.01.2009 తరువాత జన్మించి ఉండాలి అలాగే అండర్ 19 క్రీడాకారులు 01.01.2007 తరువాత జన్మించి ఉండాలి,మరియు, క్రీడాకారులు అక్టోబర్ 19 వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల కొత్తగూడెం లో హాజరు కాగలరు. అందరు వాళ్ళు స్టడీ సర్టిఫికేట్, ఫోటో తో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్ తో హాజరు కావలెను.పైన పేర్కొన్న ధ్రువీకరణ పత్రములతో పాటు తప్పనిసరిగా క్రీడాకారుడు ఆధార్ కార్డ్ , ORGINAL DATE OF BIRTH CERTIFICATE కూడా తీసుకొని రాగలరు. తీసుకొని రాని వారిని ఎట్టి పరిస్థితులలోనూ ఎంపికలకు అనుమతించబడరని, ఖమ్మం జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి, వాసిరెడ్డి నరేష్ కుమార్ ఖమ్మం జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి యాస రామారావు లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు,వ్యాయామ దర్శకులు అందరు కూడాను ఈ నియమ నిబంధనలను పాటిస్తూ క్రీడాకారుల తో హాజరు కాగలరని కోరుచున్నాము. మరిన్నివివరాలకు +91 78422 66833 9951274678 నెంబర్లను సంప్రదించగలరు
Admin
తెలుగు వెలుగు టీవీ