Tuesday, 28 July 2026 02:24:59 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు.

Date : 18 April 2026 08:33 PM Views : 136

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్య పీజీ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను బలోపేతం చేయడానికి తీసుకున్న కీలక నిర్ణయంగా, రాష్ట్రంలో తొలిసారిగా స్టాండ్ అలోన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) కోర్సులు ఏరియా ఆసుపత్రుల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, కింగ్ కోటి, పటాన్‌చెరు ఆసుపత్రులతో పాటు గిరిజన ప్రాంతాల్లోని ఎంతో కీలకమైన భద్రాచలం ఏరియా ఆసుపత్రి కూడా ఎంపిక కావడం విశేషం.భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ విభాగాలలో ప్రతి విభాగానికి 4 చొప్పున పీజీ సీట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించబడింది.ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు, ఈరోజు డీసీహెచ్ఎస్ డాక్టర్ జి. రవి బాబు ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కార్యాలయానికి పిలిపించి, సంబంధిత ఆసుపత్రికి అవసరమైన అన్ని ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేశారు . నేడు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చర్యలు పూర్తిచేయబడగా, దరఖాస్తును సోమవారం సమర్పించనున్నారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తూ, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పీజీ కోర్సులు ప్రారంభించేందుకు విశేష కృషి చేస్తున్నదని,ఇది భద్రాచలం పరిసర గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు మరియు వైద్య విద్యలో ఒక పెద్ద ముందడుగుగా నిలుస్తుంది అని స్పెషలిస్ట్ వైద్యులు , అత్యాధునిక వైద్య సదుపాయాలు, పరికరాలు, నూతన సేవల లభ్యత పెరగడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి అని డీసీహెచ్ఎస్ డాక్టర్ జి. రవి బాబు తెలిపారు .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :