తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దళిత హక్కుల పోరాట సమితి జాతీయ 2వ మహాసభల సన్నాహాక సమావేశం సీపీఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్య దర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడుతూ.. దేశంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి సమస్యల పోరాటానికి రూపకల్పన చేయాలన్నారు. దేశంలో దళితులు నేటికీ వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వం వారి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ