తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హనుమాన్ టెంపుల్ కు స్థలం కేటాయించండి - ఎమ్మెల్యే, ఏరియా జీఎంలకు వినతి... సింగరేణిలో 7ఇంక్లైన్ ఎత్తుగడ్డ హనుమాన్ టెంపుల్ కు సంబంధించి స్థలంను కేటాయించాలని, ఆలయ నిర్మాణం కోసం సింగరేణి యాజమాన్యంతో మాట్లాడాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావును హిందూ వాదులు కోరారు. మర్యాద పూర్వకంగా కలిసి స్థలము, గుడిని నిర్మించి ఇచ్చే విధంగా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి సహకరించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. అదే విదంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా జిఎం షాలేం రాజు ని మర్యాద పూర్వకంగా కలిసి ఈ విషయాన్నీ విన్నవించారు. వినతి పత్రం అందజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ