తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 15 తెలుగు వెలుగు) జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఎస్సై బాదావత్ రవి ఈరోజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై రవి మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల పాటు బ్రిటిష్ వారితో ఎనలేని పోరాటం చేయడంతోపాటు ఎందరో మహానుభావుల ప్రాణాల త్యాగఫలమే మనకు ఈ స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు.ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని తోటి వారితో స్నేహం భాగంగా మెలుగుతూ దేశ నాయకులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎస్సై రవి అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ