తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గం, చుంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండా గ్రామపంచాయతీలో నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాగా సీతారాములు మాట్లాడుతూ సర్పంచ్ పదవి గ్రామ అభివృద్ధిలో కీలకమైందని, పార్టీలకతీతంగా పనిచేసి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆయన కోరుతూ , కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కి కట్టుబడి ఉందని ఆయన అంటూ , గ్రామాలలో సమస్యలు పరిష్కరించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలు కప్పుతూ సన్మానించారు .ఈ కార్యక్రమంలో , కొత్తగూడెం సొసైటీ మాజీ అధ్యక్షులు మండే వీర హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషన్ ,కొత్తగూడెం ఓబీసీ పట్టణ అధ్యక్షులు జయప్రకాష్,జిల్లా సెక్రటరీ బొబ్బాల వెంకట్ యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు శివ, మురళి, కోటేష్, వివిధ గ్రామ సర్పంచ్,ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్స్ గ్రామస్తులు పాల్గొన్నారు .
Admin
తెలుగు వెలుగు టీవీ