Tuesday, 28 July 2026 05:58:28 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 08 June 2026 06:36 PM Views : 89

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతితో కలిసి ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి, అర్హత మేరకు వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తక్షణ పరిష్కారం సాధ్యమయ్యే అంశాలను వెంటనే పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేదా నిర్లక్ష్యానికి తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. ప్రతి సమస్య వెనుక ఉన్న మూల కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, ప్రజలు తమ వినతులతో పాటు అవసరమైన ఆధార పత్రాలను సమర్పిస్తే సమస్యల పరిష్కారం మరింత వేగవంతమవుతుందని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కట్టుబడి పనిచేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ మున్సిపాలిటీ వనమ కాలనీలో నివాసముంటున్న విజయలక్ష్మి, తమకు ఇంటి నిర్మాణ స్థలం ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేక ఇల్లు నిర్మించుకోలేకపోతున్నామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్, తదుపరి చర్యల నిమిత్తం గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌కు ఎండార్స్ చేశారు. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో నివాసముంటున్న కొండపల్లి ఉమా, తమ కుటుంబం తీవ్ర పేదరికంలో ఉందని, పదో తరగతిలో మంచి ప్రతిభ కనబరిచిన తమ కుమార్తె టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ పాల్వంచలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిందని తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష సమయంలో అనారోగ్యానికి గురికావడంతో పరీక్షకు హాజరు కాలేకపోయిందని, తమ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని సీటు కేటాయించాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తును కలెక్టర్ పరిశీలించి సంబంధిత ఆర్‌సీఓకు ఎండోర్స్ చేశారు. దుమ్ముగూడెం మండలం కోయి నర్సాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసీ రైతులు, కోయి నర్సాపురం గ్రామంలో సుమారు 250 ఎకరాల భూమిలో 116 మంది ఆదివాసీలు సాగు చేస్తున్నారని, తమ తాతముత్తాతలు భూమి శిస్తు కూడా చెల్లించి యున్నారని , పట్టాలు జారీ చేయాలని పేసా గ్రామసభ తీర్మానం కూడా జరిగిందని తెలిపారు. సర్వే నంబర్లు 28, 29, 52లలో సర్వే నిర్వహించి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్, తగు చర్యల కోసం దుమ్ముగూడెం తహసీల్దార్‌కు ఎండోర్స్ చేశారు. అశ్వాపురం మండలానికి చెందిన కోడి నాగరాజు, రోడ్డు ప్రమాదంలో తన ఎడమ చేయిని కోల్పోయానని, డిగ్రీ వరకు చదువుకున్నానని, జీవనోపాధి కోసం ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగావకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, తగు చర్యల నిమిత్తం జిల్లా ఉపాధి కల్పనాధికారికి ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :