తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఛత్రపతి సంభాజీ మహారాజ్ 336వ వర్థంతి సందర్భంగా వీర శివాజీ మహారాజ్ సేన కొత్తగూడెం ఆధ్వర్యంలో ఈనెల 11న కొత్తగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వర్ధంతి వేడుకలను నిర్వహిస్తున్నామని అధ్యక్షుడు జోగు ప్రదీప్ తెలిపారు. వివేకానంద యువజన సేవాభారతి కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ దేశభక్తులు, జాతీయ వాదులందరూ ఈ నెల 11న నిర్వహించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పిల్లి రాజేశ్వరరావు, లక్ష్మణ అగర్వాల్, స్వప్న, రాజన్న, దిలీప్, బడే రమేష్, యామిని, గుమలాపురం సత్యనారాయణ, లింగాల విజయ్, అరుణ్, అశోక్, అభిషేక్, గొడుగు శ్రీధర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ