Tuesday, 28 July 2026 02:35:50 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా అంకిత్ ఐఏఎస్ పదవీ బాధ్యతలు స్వీకరణ.

Date : 26 February 2026 08:19 PM Views : 794

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన జిల్లా కలెక్టర్‌గా అంకిత్, ఐఏఎస్ గురువారం సాయంత్రం 06:19 గంటలకు ఐడీఓసి కార్యాలయంలోని తన ఛాంబర్‌లో తొలి సంతకం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సిఎండి జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ మరియు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్ నూతన కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది హాజరై నూతన కలెక్టర్‌కు అభినందనలు తెలియజేశారు.అనంతరం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జితేష్ వి. పాటిల్ జిల్లా అధికారులను నూతన కలెక్టర్‌కు పరిచయం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్, ఐఏఎస్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా కలెక్టర్‌గా పని చేసే అవకాశం లభించడం తనకు గౌరవంగా మరియు సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాల మేరకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకత, ప్రజాహితం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుని సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ వేగవంతమైన సేవలందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు .జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పడం వంటి అంశాల్లో సమగ్రంగా ముందుకు సాగాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌కు భద్రాచలం పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :