Tuesday, 28 July 2026 04:58:54 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

వైరా ఎమ్మెల్యేను కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంజారా సంఘాల జేఏసీ ఛైర్మన్ డాక్టర్ శంకర్ నాయక్, వైస్ ఛైర్మన్ బానోత్ వీరు నాయక్.

Date : 05 November 2025 07:47 PM Views : 456

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తుల్జా భవాని జాతర ఏర్పాటుకు స్థలం, నిధులు కేటాయించాలని వినతి. హైదరాబాద్‌కు తరలివెళ్లిన ఉద్యోగ, ఉపాధ్యాయ, సాధులు, బంజార సంఘాల నాయకులు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బంజారాల ఆరాధ్య దైవమైన సంత్‌ శ్రీశ్రీశ్రీ సేవాలాల్‌ మహారాజ్, శ్రీశ్రీశ్రీ తుల్జా భవాని జాతర ఏర్పాటుకు చేయుట గురించి కాంగ్రెస్‌ పార్టీ ఎస్‌టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ అటవీ శాఖ బోర్డు సభ్యులు, వైరా నియోజకవర్గ శాసన సభ్యులు మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంజారా సంఘాల జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ శంకర్‌ నాయక్, వైస్‌ చైర్మన్‌ బానోత్‌ వీరు నాయక్‌ల ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందచేశారు. జిల్లాకు చెందిన బంజారా ఉపాధ్యాయ, ఉద్యోగ, సాధులు, బంజారా సంఘాల నాయకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 50 మందికిపైగా హైదరాబాద్‌కు తరలి వెళ్లి రాందాస్‌నాయక్‌ను కలిశారు. ఈ సందర్భంగా బంజారా సంఘాల జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బంజారాల ఆరాధ్య దైవాలకు సంబంధించి ఎటువంటి ఆలయాలు, జాతర స్థలాలు లేవని, దీనివల్ల ప్రతీ యేటా జాతరలు నిర్వహించేందుకు బంజారా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి బంజారాలు కీలకపాత్ర పోషించారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షలకు పైగా బంజారా జనాభా ఉన్నారని పేర్కొన్నారు. గతంలో జిల్లా కేంద్రంలోని రేగళ్ల ప్రాంతంలో కొంత స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆలయ నిర్మాణం జరగలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సంత్‌ శ్రీశ్రీశ్రీ సేవా లాల్‌ మహారాజ్, శ్రీశ్రీశ్రీ తుల్జా భవాని ఆలయ నిర్మాణంతోపాటు జాతర నిర్వహణ కోసం అవసరమైన స్థలాన్ని అన్ని అనుమతులతో ప్రభుత్వం కేటాయించే విధంగా కృషి చేయడంతోపాటు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలని, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి త్వరితగతిన అన్ని అనుమతులతో స్థలం కేటాయించడంతోపాటు జాతర నిర్వహణకు అవసరమైన నిధులు, సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జేఏసీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బంజారాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను విన్నవించారు. శ్రీశ్రీశ్రీ తుల్జా భవాని జాతర ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగదంబసేన వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్‌ రాములు, సాధుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నూనావత్‌ శంకర్, బిచ్చ సాధు, వస్రాం సాధు, బంజారా భవన్‌ పాల్వంచ కమిటీ నాయకులు భూక్య చందు, బానోత్‌ రాము, జిల్లా జేఏసీ నాయకులు ధరావత్‌ కాన్షీరాం, బానోత్‌ రమేష్, డాక్టర్‌ వెంకట్, జాటోత్‌ భరత్, టిఎస్‌టిటిఎఫ్‌ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షులు బి.మోహన్, సపావత్‌ బాలకృష్ణ, జర్పుల బిక్కులాల్, సేవాలాల్‌ సేన జిల్లా అధ్యక్షుడు మాళోత్‌ శివ నాయక్, ధరావత్‌ కృష్ణ, ఎల్‌హెచ్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షులు గుగులోత్‌ కేశవ్‌ నాయక్, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి గుగులోత్‌ మోహన్‌ నాయక్, చండ్రుగొండ మండల అధ్యక్షులు భూక్య రాందాస్‌ రాథోడ్, జిల్లా నాయకులు బానోత్‌ చందర్‌ నాయక్, ఏజెన్సీ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బానోత్‌ లాల్‌సింగ్‌ నాయక్, సేవాలాల్‌ సేన జిల్లా అధ్యక్షులు గుగులోత్‌ భద్రు నాయక్, భారతీయ గోర్‌బంజారా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్‌ దుర్గా ప్రసాద్, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బోడ గణేష్, గుగులోత్‌ కోటి, బానోత్‌ రాము, జర్నలిస్టు సంఘాల నాయకులు బానోత్‌ నాగేశ్వరరావు, బానోత్‌ రమేష్, బానోత్‌ రాందాస్, ధరావత్‌ వెంకన్న, బీఆర్‌ఎస్‌ నాయకులు మూడ్‌ జయరాం నాయక్, బీజేపీ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు మాళోత్‌ గాంధీనాయక్, సీపీఐ నాయకులు మాళోత్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :