తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : రైటర్ బస్తి గొల్లగుడెం త్రిమాత ఆలయ సమీపంలో డ బ్ల్యూ బిజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా నాలుగవ రోజు శనివారం హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా జరిగింది. ఓం శ్రీశ్రీశ్రీ హనుమాన్ సేవా సమితి కొత్తగూడెం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పఠనం ఆధ్యంతం దైవత్వం ఉట్టిపడేలా భజనలు చేశారు. ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపకుడు మండల శ్రీను మాట్లాడుతూ హనుమాన్ చాలీసా అనేది శ్రీ తులసీదాస్ రచించిన 40 పద్యాల స్తోత్రం, ఇది హనుమంతుడిని కీర్తిస్తుంది, దీనిని పఠించడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నారు. దుష్టశక్తుల భయం తొలగిపోతుందని, అన్ని రకాల బాధల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్మకం అని స్పష్టం చేశారు. ఈ స్తోత్రాన్ని భక్తితో జపించడం ద్వారా హనుమంతుని అనుగ్రహం పొందవచ్చని తెలిపారు. ఇది ధైర్యం, జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెబుతారని పేర్కొన్నారు. హనుమాన్ చాలీసా పఠనం ప్రాముఖ్యత ప్రయోజనాలు వినాయక మండపాలలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో, చిన్న పిల్లల్లో కమిటీ సభ్యుల్లో భక్తి భావం పెంపొందుతుంది అన్నారు. బస్తీవాసులు, కమిటీ సభ్యులు పెద్దఎత్తులో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ