Tuesday, 28 July 2026 09:40:36 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

వ్యసన బాధితులకు సమగ్ర చికిత్స, పునరావాస సేవలు అందుబాటులో- జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 11 April 2026 03:30 PM Views : 175

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను శనివారం జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. వ్యసన బాధితులకు సమగ్ర చికిత్స, పునరావాస సేవలు అందించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం అదే ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కేంద్రాన్ని కూడా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా మత్తు వ్యసనానికి గురైన వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు, నిపుణుల పర్యవేక్షణలో పునరావాస సేవలు, నిరంతర కౌన్సిలింగ్ అందించబడతాయని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మద్యానికి బానిసై చికిత్స కోసం వచ్చిన రోగితో మాట్లాడి, రోజువారీ ఆదాయం, మద్యంపై ఖర్చు వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ వ్యక్తి తాను మద్యం మానేందుకు పలు మార్లు ప్రయత్నించినప్పటికీ, వణుకుడు, ఫిట్స్ వంటి సమస్యలు రావడంతో చికిత్స కోసం ఈ కేంద్రానికి వచ్చానని తెలిపాడు. ఈ తరహా కేసులకు అందిస్తున్న వైద్య సేవలు, కౌన్సిలింగ్ విధానాలు, చికిత్స ప్రక్రియ గురించి కలెక్టర్ అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులు పూర్తిగా కోలుకునేలా సమగ్ర చికిత్సతో పాటు నిరంతర కౌన్సిలింగ్ అందించాలని వైద్యులకు సూచించారు. ఇదే సందర్భంగా “డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంగ్తెనింగ్ డే” కార్యక్రమం కింద నిర్వహించిన క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి కలెక్టర్ ప్రశంస పత్రాలు, శిల్డులను అందజేశారు. యువతలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. మత్తు వ్యసన నిర్మూలనలో ప్రభుత్వ శాఖలు, వైద్య విభాగం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులు బాధితులను ప్రోత్సహించి, ఈ కేంద్రం సేవలను వినియోగించుకునేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, ఆసుపత్రి సూపర్డెంట్ రమేష్, డాక్టర్ రాధిక, డాక్టర్ రాదా మోహన్, ఇతర వైద్యులు సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :