Tuesday, 28 July 2026 11:05:10 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఫోరెన్సిక్ సాక్ష్యం పై అవగాహన సదస్సు ను విజయవంతం చేయండి

Date : 30 October 2025 05:15 PM Views : 385

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫోరెన్సిక్ సాక్ష్యం పై అవగాహన సదస్సు ను విజయవంతం చేయండి - ఐ.ఎల్.పీ.ఏ జిల్లా కన్వీనర్ గోపికృష్ణ, సుంకర భానుప్రియ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదుల కోసం “ఫోరెన్సిక్ సాక్ష్యం పై అవగాహన కార్యక్రమం వచ్చే నెల నవంబర్ 1న శనివారం ఉదయం 10:30 గంటలకు కొత్తగూడెం అడ్వకేట్స్ లైబ్రరీ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు ఐ.ఎల్.పీ.ఏ. జిల్లా కన్వీనర్ గోపికృష్ణ, మహిళా కన్వీనర్ సుంకర భానుప్రియ తెలిపారు. గురువారం న్యాయవాదుల లైబ్రరీ హాల్ లో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ILPA), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జరగనున్న “నేటి న్యాయవ్యవస్థలో ఫోరెన్సిక్ - శాస్త్రీయ సాక్ష్యాలు అత్యంత కీలకమైనవని, న్యాయవాదులు ఈ రంగంలో అవగాహన పెంపొందించుకోవడం ద్వారా న్యాయ సాధనలో మరింత సమర్థవంతంగా వ్యవహరించగలరని అన్నారు. సదస్సులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదులందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డా. మోహన్ ఎర్రగోళ (Ph.D.), ఫౌండర్ - డైరెక్టర్ – ప్రోబ్ ల్యాబ్ ఫోరెన్సిక్, హైదరాబాద్, ప్రధాన వనరుల నిపుణుడిగా పాల్గొని ఆయా అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనలతో అవగాహన కల్పిస్తారని పాలీగ్రాఫిక్ & ఫింగర్‌ప్రింట్ టెస్టులు,నార్కో విశ్లేషణ,లై డిటెక్షన్,సంతకం పరీక్ష, డిజిటల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ల్యాబ్ విధానాలు,శాస్త్రీయ విశ్లేషణ పద్ధతులు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా న్యాయమూర్తి పి.వసంత్, విశిష్ఠ అతిధిగా అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.సరిత హాజరుకానున్నారని వీరితో పాటు ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడపాల మహాలక్ష్మి, యెర్రా కామేష్, సాధిక్ పాషా, ఎర్రపాటి కృష్ణ, మారపాక రమేష్, దొడ్డా సామంత్, మేకల దేవేందర్, అడపాల పార్వతీ, పాల రాజశేఖర్, పగిడిపల్లి శ్రీకాంత్, వడ్లకొండ హరిప్రసాద్, లక్ష్మీ సరిత, ఇందిరా ప్రియదర్శిని, బేబీ షామిలి, దారావత్ రాధాకృష్ణ, ఎర్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :