Tuesday, 28 July 2026 07:10:37 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అశ్వాపురంలో ఆదివాసీ మహిళల పట్ల ఫారెస్ట్ అధికారుల ప్రవర్తన దుర్మార్గమైన చర్య – బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. వెంకన్న నాయక్.

Date : 18 July 2026 07:16 PM Views : 356

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, మనుబోతులపాడు గ్రామపంచాయతీ పరిధిలో ఆదివాసీ మహిళలతో ఫారెస్ట్ అధికారులు దురుసుగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. వెంకన్న నాయక్ పేర్కొన్నారు. ఆదివాసీ మహిళల గౌరవం, భద్రత, రాజ్యాంగబద్ధ హక్కులు మరియు ప్రజాస్వామ్య విలువలపై జరిగిన ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మహిళ గౌరవప్రదంగా జీవించే హక్కు కలిగి ఉందని, ముఖ్యంగా ఆదివాసీ మహిళల పట్ల అధికార యంత్రాంగం అత్యంత సున్నితంగా, మానవీయంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే నిష్పక్షపాత విచారణ చేపట్టి, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. విచారణలో అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.మహిళల గౌరవాన్ని, ఆదివాసీల హక్కులను కాపాడటం ప్రభుత్వ యంత్రాంగం యొక్క రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొన్న ఆయన, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థే ప్రజల్లో భయాందోళనలు సృష్టించే పరిస్థితి రావడం అత్యంత విచారకరమని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ అంశాన్ని నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ గారి దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని డా. వెంకన్న నాయక్ ఈ సందర్భంగా తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :