Tuesday, 28 July 2026 02:31:45 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఏపిలోని నాలుగు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలి:కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

Date : 29 June 2025 08:28 PM Views : 522

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నిజామాబాద్, జూన్ 29: కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా చేతుల మీదుగా నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం సందర్బంగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనకు స్వాగతం పలికారు. పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల పలు సూచనలు చేశారు- ఆంధ్రప్రదేశ్ లో కలిసిన భద్రాచలం చుట్టుపక్క వున్న యటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్రమంత్రిని కోరారు. నిజామాబాద్ లో కేంద్రమంత్రి అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభమయింది. ఇదివరకే రాష్ట్రంలోని నిజామాబాద్ కి పసుపు బోర్డు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, ఆదివారం దాని ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్ లో ప్రారంభించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు నిజామాబాద్ ఇంచార్జీ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. నిజామాబాద్ కి పసుపు బోర్డు ప్రకటించి, దాని కార్యాలయాన్ని కూడా ప్రారంభించినందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ తరపున కృతజ్ఙతలు తెలిపారు. అలాగే పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పసుపు రైతులు తమ పంటను కనీస మద్ధతు ధరకు అమ్ముకునే విధంగా ధరలలో స్థీరికరణ తేవాలన్నారు. అందుకోసం పసుపు పంటకు కనీస మద్ధతు ధర ప్రకటించాలని, మార్క్ ఫెడ్, నాఫెడ్ వంటి సంస్థల ద్వారా నేరుగా కొనుగోళ్లను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పసుపు ప్రధానంగా పండే ప్రాంతాలలో డ్రైయింగ్ ప్లాట్‌ఫార్ములు నిర్మాణానికి కేంద్ర నిధులను కేటాయించాలన్నారు. రైతుల వద్దనే పసుపు పాలిషింగ్, గ్రేడింగ్ యంత్రాలను అందుబాటులోకి తేవడం ద్వారా మార్కెట్ విలువ పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. అధిక కర్క్యూమిన్ శాతం, వ్యాధి నిరోధకత, ఎగుమతులకు అనుకూలత కలిగిన విత్తన రకాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తూ, ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పసుపు సాగు యాంత్రీకరణ, విలువ ఆధారిత గొలుసు అభివృద్ధిపై ఐసీఏఆర్ మరియు యూజీసీ మద్దతుతో పరిశోధనలకు తోడ్పాటు కల్పించాలని, భౌగోళిక సూచిక (జి ఐ) ఆధారంగా తెలంగాణ పసుపును అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రాండ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని అన్నారు. పసుపు పంటను ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు డాక్యుమెంటేషన్‌ను సరళీకరించడం, అంతర్జాతీయ వాణిజ్య డెలిగేషన్లు, ఎగ్జిబిషన్లలో రైతుల పాల్గొనడాన్ని ప్రోత్సహించాలన్నారు. పసుపు రైతులకు వారి స్థానిక భాషల్లో సలహాలు అందించే విధంగా మొబైల్ యాప్ లు అభివృద్ధి చేయాలని, విలువ ఆధారిత, సేంద్రీయ సాగు, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, పసుపు సాగులో కార్మిక వ్యయాన్ని తగ్గించేందుకు ఉపాధి హామీ పథకంతో సమన్వయం చేయాలన్నారు. పసుపు రంగ అభివృద్ధి కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పసుపు బోర్డు మరియు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రస్తుత పసుపు సాగు పరిస్థితులపై బేస్‌లైన్ సర్వేను చేపట్టి, వచ్చే ఐదు సంవత్సరాల కోసం ప్రణాళికను రూపొందించాలని అన్నారు. ఏపిలోని నాలుగు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలి. ఏపి పునర్విభజన చట్టం 2014 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కలిసిన భద్రాచలం చుట్టుపక్క గ్రామాలైన యాటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు మరియు పురుషోత్తపట్నం లను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్రమంత్రిని లేఖ ద్వారా కోరారు. భద్రాచలం పట్టణం తెలంగాణలో కొనసాగుతుండగా, యటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం అనే గ్రామ పంచాయతీలు [17 రెవెన్యూ గ్రామాలు] విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని, వీటి వలన అనేక పరిపాలనా, అభివృద్ధి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రాచలం పట్టణం మరియు తెలంగాణ ప్రధాన మండలాల మధ్య రవాణా అంతరాయం ఏర్పడుతుందని, భద్రాచలంలోని విద్యాసంస్థల్లో చదివే గిరిజన విద్యార్థులకు రాకపోకల్లో మరియు రెండు రాష్ట్రాల చెక్‌పోస్టుల వల్ల గిరిజనులు, వాణిజ్య వాహనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఎల్‌డబ్ల్యూ‌ఈ ప్రభావిత ప్రాంతం కావడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయని, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం నిర్వహణకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని, ఎందుకంటే దేవస్థానం భూములు ఏపీ పరిధిలో ఉన్నాయని అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, ఆ గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడం అత్యవసరమని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం తగిన చట్టపరమైన, పరిపాలనా చర్యలు తీసుకోవాలని కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :