తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ కి ఆర్ధిక పునరావాస పథకం కింద ఒక్కొక్క యూనిట్ కి Rs.75,000/- చొప్పున మొత్తం 8 యూనిట్ లకు 100% సబ్సిడీ రుణాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా తెలిపారు. కావున జిల్లాలోని అర్హులైన ట్రాన్స్ జెండర్స్ పర్సన్స్ wdsc.telangana.gov.in వెబ్ సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్ లోడ్ చేసుకొని సంబంధిత అన్ని ధృవ పత్రాలతో దరఖాస్తునీ కింద తెలిపిన ధ్రువపత్రాలతో ఈ నెల 13 వ తారీఖు లోపు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళలు, పిల్లలు, దివ్యాంగుల వయోవృద్ధుల, మరియు ట్రాన్స్ జెండర్స్ శాఖ, కలెక్టరేట్ కాంప్లెక్స్ , రూమ్ నెంబర్ G- 1 నందు సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి స్వర్ణలత లేనినా పత్రిక ప్రకటన ద్వారా తెలియచేస్తున్నారు. వివరాలకు 6301981960, 8331006010 నంబర్లను సంప్రదించగలరు. అర్హతలు:1. సదరు ట్రాన్స్ జెండర్ వ్యక్తికి సంబంధిత కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన గుర్తింపు పత్రం మరియు గుర్తింపు కార్డు ఉండాలి.2. వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.3. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.1.50 లక్షలు మరియు పట్టణ ప్రాంతాలలో రూ.2.00 లక్షలకు మించకూడదు.4. అభ్యర్ధులు గత (5) సంవత్సరాలలో వికలాంగుల సంక్షేమ శాఖ నుండి గానీ, మరే ఇతర శాఖ నుండి గానీ లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి గానీ సబ్సిడీని పొంది ఉండకూడదు.5. ఒక కుటుంబానికి (5) సంవత్సరాలలో కేవలం ఒక స్వయం ఉపాధి పథకానికి మాత్రమే పరిమితం చేయబడుతుంది.6. ఈ పథకాన్ని పొందిన లబ్దిదారులు తదుపరి (5) సంవత్సరాల వరకు అటువంటి పథకం కింద ఏ ప్రయోజనానికి అర్హులు కారు.7. సాంకేతిక అర్హతలు ఉన్న మరియు/లేదా సంబంధిత కార్యకలాపంలో గణనీయమైన అనుభవం ఉన్న అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.8. ఏదైనా యూనిట్ కోసం శిక్షణ పొందిన అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.9. విద్యార్హత పత్రములు ఏవైనా మరియు (02) పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.
Admin
తెలుగు వెలుగు టీవీ