Tuesday, 28 July 2026 10:18:51 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

Date : 26 June 2026 08:54 PM Views : 114

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటర్ల జాబితా పక్కాగా ఉంటేనే ప్రజాస్వామ్య బలోపేతం.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం.కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణపై దృష్టి పెట్టాలి.క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాలను నిరంతరం పరిశీలించాలి.ప్రజాస్వామ్య వ్యవస్థలో బిఎల్ఏల పాత్రే అత్యంత కీలకం.బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. ఓటర్ల జాబితా పక్కాగా ఉంటేనే ప్రజాస్వామ్య బలోపేతం సాధ్యమవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని సిపిఐ మండల కార్యాలయం 'రజబ్ అలీ భవన్'లో శుక్రవారం చుంచుపల్లి మండల స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (బిఎల్ఏ)ల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా అయన బిఎల్ఏలను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ, క్రమబద్ధీకరణపై, బిఎల్ఏల విధులపై అవగాహనా పెంచుకోవాలని, పోలింగ్ కేంద్రాల పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులను గుర్తించి కొత్త ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. మరణించిన వారి పేర్లు, ఒకే పేరుతో రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగించేలా క్షేత్రస్థాయిలో నిరంతరం పరిశీలన జరపాలని కోరారు. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పోలింగ్ కేంద్రాల వారీగా వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలన్నారు. సర్ ప్రక్రియలో పార్టీ బిఎల్ఏ అప్రమత్తంగా ఉండాలని, బిఎల్వో లకు సహకరిస్తూ సమగ్ర ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు సహకరించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బిఎల్ఏల పాత్ర అత్యంత కీలకమైనదని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తమ విధులను పూర్తి బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. సమావేశంలో మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు జి వీరాస్వామి, నాయకులు మహేష్, భూక్యా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :