తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు మేరా యువ భారత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో తేదీ:31-07-2026 రోజు జిల్లాస్థాయిలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద 8 రకాల పోటీలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో నిర్వహించబడుతాయి. ఈ జిల్లా స్థాయి పోటీలలో 15 నుండి 29 సంవత్సరముల లోపు యువతీ యువకులు పాల్గొనవచ్చును. ఈ కార్యక్రమంలో కవిత్వము, పెయింటింగ్, స్లోగన్ రైటింగ్, ఉపన్యాస పోటీలు, గ్రూపు డాన్స్, గ్రూప్ సాంగ్, షార్ట్ ఫిలిం లేదా రీల్, స్కిట్ నిర్వహించబడతాయి. జిల్లా స్థాయిలో మొదటి బహుమతి సాధించిన వారికి రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆసక్తి కలిగిన యువతీ యువకులు డైరెక్టుగా ఉదయం 9:45 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో పాల్గొనగలరని తెలియజేయనైనది.
Admin
తెలుగు వెలుగు టీవీ