Tuesday, 28 July 2026 07:20:25 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గం ఆదర్శనీయం టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

Date : 19 September 2024 08:01 PM Views : 557

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ - ఉన్ - నబీ సందర్బంగా గురువారం కొత్తగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద అహలే సున్నత్ వల్ జమాత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా లతో కలిసి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, అల్లాహ్ ప్రపంచ శాంతి కోరుతూ చివరి ప్రవక్తగా మహమ్మద్ ఎంపికయ్యాడని, ముస్లింలందరూ అత్యంత పవిత్ర గ్రంథంగా భావించే ఖురాన్ గ్రంథంలో వీటి గురించి పేర్కొనబడిందని తెలిపారు. మహమ్మద్ ప్రవక్తను విశ్వశాంతి కోసం అల్లాహ్ నియమించారని, అందుకే తను జన్మించిన రోజున ఆయనను స్మరించుకుంటూ మిలాద్-ఉన్-నబీ పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో యువత ముందుకెళ్ళాలని హిందువులకు భగవద్గీత, క్రిష్టియన్ లకు బైబిల్, ముస్లిం లకు ఖురాన్ బోధించేది శాంతి సందేశమేనని ఆయన అన్నారు.నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ రాష్ట్ర నాయకుడు యెర్రా కామేష్ , మాజీ కౌన్సిలర్, అహలే సున్నతుల్ జమాత్ పట్టణ అధ్యక్షులు రజాక్, ప్రధాన కార్యదర్శి న్యాయవాది సాదిక్ పాషా,మైనారిటీ రాష్ట్ర నాయకులు రహీంఖురేషి,టీపీసీసీ సభ్యులు జెబి శౌరి, మొత్కూరి ధర్మారావు, మైనారిటీ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మహమ్మద్ ఖాన్,ఎండి కరీం పాషా, ఓబీసీ జిల్లా పట్టణ అధ్యక్షులు అల్లుడి.నర్సింహారావు,జయప్రకాష్, EX Mptc కసనబోయిన.భద్రం, ఆన్వర్, గౌస్, మాజీ కౌన్సిలర్ యూసుఫ్, కౌన్సిలర్ ధర్మారావు, దస్తగీర్, రాజశేఖర్,సురేష్,రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :