తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మూడు లీగల్, మూడు సర్వైలెన్స్ నమూనాల సేకరణ – రెండు ఇంప్రూవ్‌మెంట్ నోటీసుల జారీ .ఫిర్యాదుల మేరకు మంగళవారం సుజాతనగర్‌లోని పలు హోటళ్లు, స్వీట్ల తయారీ, విక్రయ దుకాణాల్లో ఆహార భద్రత అధికారి శరత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా కొన్ని ఆహార వ్యాపార సంస్థలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన రిజిస్ట్రేషన్, లైసెన్సులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సంబంధిత నిర్వాహకులు వెంటనే రిజిస్ట్రేషన్, లైసెన్సులు పొందడంతో పాటు ఆహార భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు మూడు లీగల్ నమూనాలు, మూడు సర్వైలెన్స్ నమూనాలను సేకరించి విశ్లేషణ నిమిత్తం రాష్ట్ర ఆహార పరీక్షా ప్రయోగశాలకు పంపించారు. అలాగే పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల్లో లోపాలు గుర్తించిన రెండు ఆహార వ్యాపార సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆహార భద్రత అధికారి శరత్ మాట్లాడుతూ, ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడం ప్రతి ఆహార వ్యాపార సంస్థ బాధ్యత అని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఆహార వ్యాపార సంస్థ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ లేదా లైసెన్సు కలిగి ఉండాలని, పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.నిబంధనలు ఉల్లంఘించే ఆహార వ్యాపార సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిల్లాలో ఆహార భద్రత శాఖ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆహార భద్రత అధికారి శరత్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ