తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. వేంసూరు దుద్దేపూడికి చెందిన ముత్యాల హరీష్ (22) ఆన్లైన్ యాప్ ద్వారా తీసుకున్న రూ. 5 వేల రుణం తిరిగి చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు అతడిని బెదిరింపులకు గురిచేశారు. న్యూడ్ మార్ఫింగ్ ఫోటోలు స్నేహితులు, బంధువులకు పంపుతామని హరీష్ ను తీవ్రంగా వేధించడంతో మనస్తాపానికి గురైన అతను పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ హరీష్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ