తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యాజామాన్యాన్ని, కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్న సర్కార్ సంఘం. కార్మికుల అండతో పోరాటాలు చేసి ఎన్నో హక్కులు సాధించిన చరిత్ర ఏఐటియుసి ది. కార్మికుల సమస్యలను పరిష్కరించేంత వరకు స్ట్రక్చర్ సమావేశాల్లో ఎఐటియుసి పాల్గొనదు. సమస్యల పరిష్కారం లో యాజమాన్యం మొండికేస్తే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె కు పిలుపు నిస్తాం. ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐటీయూసీ నాయకత్వం స్పస్టీకరణ. సింగరేణి లో యాజమాన్యం నిర్వహించిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో గుర్తింపు సంఘం ఏఐటియుసి తో ఒప్పుకున్న కార్మికుల సమస్యలపై ఇంత వరకు వాటి అమలు కోసం సర్క్యులర్ లు జారీ చేయలేదని, వాటిని పరిష్కరించేంత వరకు స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పాల్గొనబోమని శుక్రవారం ది.12.09.2025 న హైదరాబాద్ లో యాజమాన్యం ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ మరియు సెంట్రల్ ఆర్గనైసింగ్ సెక్రెటరీ జి. వీరస్వామి పేర్కొన్నారు. నేడు శేషగిరి భవన్ లో జరిగిన ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి లో గుర్తింపు సంఘం ఏఐటియుసి గెలిచిన తరువాత కార్మికుల కు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం యాజమాన్యం కు లేఖలు రాయడం జరిగిందని, వాటి పై ఇప్పటి వరకు రెండు సార్లు డైరెక్టర్ పా స్థాయి, ఒక సారి సి అండ్ ఎండి స్థాయి స్ట్రక్చర్ కమిటీ సమావేశాలు జరిగాయని అందులో కొన్ని సమస్యల్ని అంగీకరించిన యాజమాన్యం ఇంత వరకు సర్క్యులర్ లు జారీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కాలేదని కొన్ని కార్మిక సంఘాలు ఏఐటియుసి పై పనిగట్టుకొని అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. ముఖ్యంగా సర్కారు సంఘం ఐఎన్టీయుసి సమస్యలు పరిష్కారం కాకుండా యాజమాన్యాన్ని, అధికారుల ను బెదిరిస్తూ అడ్డుకుంటూ ఏఐటియుసి ని బద్నాం చేస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా యాజమాన్యం పై ఐఎన్టీయుసి నాయకులు ఒత్తిడి చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా సింగరేణి లో కొత్త గనులు రావడం కోసం, స్వంత ఇంటి పథకం అమలు కోసం, మారుపేర్లు విజిలెన్స్ కేసులతో పాటు తదతర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఏఐటియుసి పై కొన్ని కార్మిక సంఘాలు కార్మికుల కు తప్పుడు సంకేతాలు ఇచ్చి ఆందోళన కు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. సింగరేణి లో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కార్మికుల అండతో పోరాటాలు ఉద్యమాలు చేసి హక్కులు సాధించే దమ్ము, ధైర్యం ఒక్క ఏఐటియుసి కి ఉందని ఆయన పేర్కొన్నారు. వెంటనే మొత్తం లాభాల్ని ప్రకటించి వాటిపై కార్మికులకు 35% లాభాల వాటా చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే అన్ని కార్మిక సంఘాల ను కలుపుకొని ఏఐటియుసి సమ్మె కు పిలుపునిస్తుందని వారు అన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు బ్రాంచ్ సెక్రటరీ ఎస్వీ రమణమూర్తి, కొత్తగూడెం బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ గట్టయ్య, కార్పొరేట్ బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ సామల రాము, వైస్ ప్రెసిడెంట్ కే డబ్ల్యూ క్రిస్టఫర్, ఆఫీస్ బేరర్స్ నాగయ్య, ఎస్.కె హ్యూమయుమ్, సందేబోయిన శీను, బండారి మల్లయ్య పిట్ సెక్రటరీస్ అనంతలక్ష్మి జె రమేష్ రామ్ శంకర్ నరేష్ రాజేశ్వరరావు వేమన చారి సత్యనారాయణ బ్రహ్మచారి నరసింహ శ్యామ్ కుమార్ పల్నాటి ప్రశాంత్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ