తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 29 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల మరియు పరిసర ప్రాంత విద్యుత్ వినియోగదారులకు మరియు రైతు సోదరులకు మనవి గత కొంతకాలంగా గుర్తుతెలియని వ్యక్తులు పొలాల్లో అమర్చిన ట్రాన్స్ఫార్మర్ లను ఓపెన్ చేసి అందులోని రాగి తీగను దొంగతనం చేస్తున్నారు. దానివలన రైతులకు సరైన సమయంలో మోటార్లు నడవక చాల నష్టం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్క రైతు సోదరులు తమపొలంలో ఎవరైనా అనుమానంగా కనిపించినా రాగి తీగ దొంగలు ఎవరైనా దొరికినా విద్యుత్ శాఖ వారికి కానీ పోలీసు అధికారులకు కానీ సమాచారం అందించగలరు.దానివలన రైతులకు విద్యుత్ శాఖ వారికి నష్టం జరగకుండా కాపాడిన వారు అవుతారు అని జూలూరుపాడు సబ్ స్టేషన్ ఏ ఈ సతీష్ పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ