తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కుక్కలు ,కోతుల నివారణకు తక్షణమే చర్యలు తీసుకొని వాటి నుండి ప్రజలను రక్షించాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. గురువారం డివిజన్ పరిధిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కుక్కలు ,కోతులు పెద్దలపై ,చిన్న పిల్లలపై దాడులు చేస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం సరికాదని ఆమె అన్నారు .మున్సిపల్ సిబ్బందిపైకూడా రెండు సందర్భాల్లో కోతులు, కుక్కలు దాడి చేసినా అధికారుల్లో చలనం లేకపోవడం శోచనీయమని అన్నారు. నిన్న పాల్వంచలో జరిగిన శిశువు తలను కుక్కలు తినడం దురదృష్టకరమైన ఈ సంఘటనను చుసిన తరువాత కూడా కార్పొరేషన్ అధికారులు మేలుకొని కుక్కలు ,కోతుల నివారణ పట్ల చర్యలు తీసుకోవాలని మరొక్కసారి అధికారులను డిమాండ్ చేశారు. కోతుల, కుక్కల నివారణ పట్ల అధికారులు చర్యలు తీసుకోనట్లయితే ప్రజలను సమీకరించి ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె హెచ్చరించారు ఈ సమావేశంలో నాయకులు బెల్లం బేబీ, రావి శెట్టి పద్మ, రామ్ రాకేష్, వాసం బాబు, మార్తమ్మ, గుంజ వెంకన్న తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ