తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీనగర్ గ్రామపంచాయతీ పరిధిలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం, వికాస్ తరంగణి ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ జరిగే ఉచిత కంటి పరీక్ష శిబిరం ప్రదేశాన్ని పరిశీలించిన సీనియర్ లయన్స్ క్లబ్, కొత్తగూడెం క్లబ్ కార్యదర్శి కోనేరు పూర్ణ చందర్ రావు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్‌చంద్. శ్రీనగర్ కాలనీ ఐదవ వీధిలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గ్రౌండ్‌లో అక్టోబర్ 22నా తేదీ ఉదయం 9 గంటల నుంచి శిబిరం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ శిబిరాన్ని శరత్ మాక్సివిజన్ కంటి ఆసుపత్రి, ఖమ్మం నిర్వహించనుంది. గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, సింగరేణి, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల కింద ఉన్నవారి కోసం క్యాష్‌లెస్ క్యాటరాక్ట్ ఆపరేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు.శిబిరానికి హాజరయ్యే ప్రతి కుటుంబానికీ రూ. 2,000 విలువైన ఉచిత ఫ్యామిలీ ప్రివిలేజ్ కూపన్ అందజేయబడనున్నట్లు రమేష్‌చంద్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 98856 30479, 72878 45001 నంబర్లను సంప్రదించాలని సూచించారు. (అందరూ ఆహ్వానితులే). ఈ కార్యక్రమంలో చిట్టిబాబు శ్రీశైలం జయకుమార్, బాలునాయక్, కలవల చంద్రశేఖర్ మండల ప్రభుత్వ వైద్యాధికారి సిబ్బంది, వికాస తరంగిణి చీఫ్ కోఆర్డినేటర్,రమాదేవి సభ్యులు వెంకటేశ్వర సాబు, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ