తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టీబీజీకేఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పైన ఐఎన్టీసీ నాయకులు జన ప్రసాద్ తప్పుడు మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు టీబీజీకేస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన నాటినుండికల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికులకు మాజీ సీఎం కేసీఆర్ తో మాట్లాడి అనేక హక్కులు తీసుకురావడం జరిగింది. సకలజనుల సమ్మె కాలానికి సమ్మె చేసి నష్టపోయిన జీతం తిరిగి చెల్లించడం. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వడం, 3200 పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు ఒకే దఫా ఉద్యోగం ఇప్పించడం, కరెంటు కటింగు వన్ పర్సెంట్ కోలిండియాలో లేనివిధంగా నిలుపుదల చేయడం, కోలిండియాలో లేని విధంగా మ్యాచ్ గ్రాంట్ పదికి పది లక్షల కలిపి ఇవ్వడం, గతంలో ఉన్న యూనియన్లు ఏసీ కోసం 1500 రూపాయలు కరెంట్ బిల్లు కడతామంటే ఒప్పుకొని యాజమాన్యం టీబీజీకేఎస్ అధ్యక్షులు చొరవతో ఉచితంగా ఏసీలకు కరెంటు ఇవ్వడం జరిగింది. కోలిండియాలో లేని తండ్రులకు కార్పొరేట్ వైద్యం కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టే విధంగా చేయడం జరిగింది. వృత్తి పన్ను 1%ను శాశ్వతంగా రద్దు చేయడం జరిగింది. ప్రాఫిట్ బోనస్ 16% ఉన్నదానిని 32% వరకు మొత్తం నికర లాభంలో నుండి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న యూనియన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా 4700 కోట్ల నుండి 2289 కోట్లు పక్కనపెట్టి 16.7% గా 2411కోట్లను పంచడం జరిగింది. ఐ ఎన్ టియూసి గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరు మీద కార్మికులకు 4000రూపాయలు చొప్పున ఇచ్చి
దాదాపు 10,000మంది కార్మికులను తీసివేసి వారి పొట్ట కొట్టడం జరిగింది. ఇటువంటి గొప్ప ఘన కీర్తి కలిగిన ఐఎన్టిసి యూనియన్ నాయకులు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ని మిర్యాల రాజి రెడ్డి ని పైన తప్పుడు మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇటువంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు రాబోయే ఎలక్షన్లలో కార్మికులే బుద్ధి చెప్తారు మీకు. జాతీయ సంఘాo అని చెప్పుకుంటుంటారు కోల్ ఇండియాలో మీకు ప్రాతినిధ్యం ఎక్కడిది. యూనియన్ ఎలక్షన్ల ముందు అనేక వాగ్దానాలు చేశారు 250 గజాల ఇంటి స్థలం ఇప్పిస్తానన్నారు,20 లక్షల వడ్డీ లేని రుణము ఇస్తానన్నారు, పెర్క్స్ మీద ఇన్కంటాక్స్ రద్దు చేపిస్తా మన్నారు అన్నారు 14 నెలల కాలంలో కార్మికులకు ఒక్క హక్కు కూడా సాధించి పెట్టలేదు. 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు చేసింది మేము చేసినమని చెప్పుకుంటున్నారు ఎలక్షన్ల ముందు అన్ని యూనియన్లు సంతకాలు పెట్టి అగ్రిమెంట్ చేసుకున్న హక్కుని మీరు చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. మేము ఒకే పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళం మా నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది మాకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వద్దని వారి మీద నమ్మకంతో మేము పనిచేస్తూ వెళ్తాము. మీ పార్టీని నమ్ముకున్న వాళ్లకు మీరు ఏం చేశారో కార్మికులందరికీ తెలుసు.ఈ సమావేశంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య , కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ రా సూరి శంకర్, కాగితపు విజయ్ కుమార్,మీసాల మురళి,అశోక్,రవి వర్మ,సూర్యనారాయణ, సూరజ్ రాజకుమార్,తిరుపతి,అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ