Tuesday, 28 July 2026 03:57:37 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సింగరేణి సూపర్ బజార్ పునర్నిర్మాణం చేపట్టాలి.జిఎం కి వినతి పత్రం అందిస్తున్న 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ.

Date : 20 July 2026 06:38 PM Views : 265

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సూపర్ బజార్ పునర్నిర్మాణం చేపట్టాలి. ఖాళీ చేస్తున్న క్వార్టర్లు కూలగొట్టకుండా చూడాలి.జిఎం కి వినతి పత్రం అందిస్తున్న 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం 16వ డివిజన్ లోని మార్కెట్ ఏరియాలో గల పాత సూపర్ మార్కెట్ ఏరియాలో నూతన బిల్డింగ్ నిర్మాణం చేసి రామవరం ప్రాంత అభివృద్ధికి సహకరించాలని రుద్రంపూర్ ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ షాలెం రాజు కి 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ వినతి పత్రాన్ని అందించారు. అనంతరం జిఎంకు వివరిస్తూ రామవరం ప్రాంతం గతంలో సింగరేణి కార్మికులతో కలకలాడుతుండే దని ఆనాటి వైభవం నేడు లేదని అన్నారు.,మరల పూర్వ వైభవం కోసం మార్కెట్ ఏరియాలో గల పాత సూపర్ మార్కెట్ లో నూతన భవనం నిర్మాణం చేపట్టి దానిలో సూపర్ మార్కెట్ నిర్మాణం చేపట్టాలని కోరారు. తద్వారా దాని చుట్టూ ఉన్నటువంటి కూరగాయలు, పండ్లు, పూలు ఇతర షాపులు నడుపుకునే వారికి జీవనోపాధికి ఉపయోగపడేటట్లుగా నిర్మాణం చేయడం ద్వారా చాలామందికి ఉపాధి మార్గాలు దొరుకుతాయని ఆమె వివరించారు. దీనిపై స్పందించిన జిఎం శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు గారు ఇచ్చిన వినతి ప్రకారం కొత్తగూడెం, రామవరం సింగరేణి సూపర్ బజార్ల నిర్మాణం ఫైల్ అండర్ ప్రాసెస్ లో ఉందని జిఎం అన్నారని ఆమె తెలిపారు.అలాగే కార్మికులు ఖాళీ చేసిన క్వార్టర్లను కూ లగొట్టడం ద్వారా ఆసాంఘిక, క్రిమి కీటకాలకు నిలయంగా మారుతున్నాయని జిఎం దృష్టికి తీసుకెళ్లారు. క్వార్టర్లను కూలగొట్టే విధానాన్ని ఆపాలని, పేదవారికి ఉపయోగపడే విధంగా చూడాలని వినతి పత్రంలో కోరారు. అలాగే మహిళా సంఘాల స్వయం ఉపాధి శిక్షణ కు, వారి సమావేశాలకు ఉపయోగపడే విధంగా ఒక కాలి క్వార్టర్ను కేటాయించాలని జి యం దృష్టికి మునిగడప పద్మ తీసుకెళ్లారు. అలాగే అంబేద్కర్ చమన్ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి రామవరం ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా ఉండేటట్లు సహకరించాలని జిఎం కి వివరించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో న్యాయవాది, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, ఉన్నం దాస్ గడ్డ శాఖ టు కార్యదర్శి ఎస్కే జలీల్ తదితరులు ఉన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :