Tuesday, 28 July 2026 02:31:20 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం – అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

Date : 07 March 2026 01:48 PM Views : 232

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ పాల్గొని స్వచ్ఛత కార్యక్రమాలను ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో మంచి స్పందన కనిపించింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా కౌన్సిలర్లను, మున్సిపల్ మహిళా సిబ్బందిని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఘనంగా సన్మానించారు. మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొంటూ వారి సేవలను ఎమ్మెల్యే అభినందించారు. మహిళలకు సమాజంలో మరింత గౌరవం, అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, యువతతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మున్సిపాలిటీ కార్యాలయం నుండి ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధుల గుండా స్థానిక కూడలి వరకు సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, కౌన్సిలర్లు, డేరంగుల ప్రసాద్, దగ్గుమల్లి మౌనిక, చిన్నంశెట్టి శ్రీను, కట్ట సింధుజ, కొట్టే నాగ సునీత, షేక్ రహీన, కారం కనకదుర్గ, మిండా హరిబాబు, నార్లపాటి మహేష్ బాబు, పట్టం రమ్య, మోర్ల రాజేశ్వరి, దండ బత్తుల ఆదిలక్ష్మి, తిరుమల శెట్టి వెంకన్న బాబు, షేక్ నూర్జహాన్, నార్లపాటి దివాకర్, మున్సిపల్ కమిషనర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, యువత మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :