తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా భారత్ రూరల్ లైవ్లిహుడ్ ఫౌండేషన్ (BRLF) ఆధ్వర్యంలో సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, తెలిపారు.మంగళవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఐ డి ఓ సి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్ నందు ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి భారత్ లైవ్లిహుడ్ సంస్థ ప్రతినిధులు మరియు జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో BRLF ప్రాజెక్టు అమలుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర లలోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం మరియు కరకగుడెం మండలాలు ప్రాధాన్యతా మండలాలుగా ఎంపిక చేయబడి, గ్రామీణ గిరిజన ప్రజల జీవనోపాధి, ఉపాధి అవకాశాలు మరియు వ్యవసాయాభివృద్ధి దిశగా ఈ సంస్థ కార్యక్రమాలు కొనసాగనున్నాయని ఆయన వివరించారు.ఈ సంస్థ యొక్క తాత్కాలిక కార్యాలయం భద్రాచలం ఐటిడిఏ (ITDA) కార్యాలయంలో ఏర్పాటు చేయబడిందని, అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించబడతాయని కలెక్టర్ తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో మూడు మండలాలకు బ్లాక్ అధికారులు, అలాగే 24 సీఆర్పీ (Community Resource Persons) నియమించబడతారని ఆయన చెప్పారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సంస్థ కార్యకలాపాలు అన్ని శాఖల సమన్వయంతో సాగుతాయి. ముఖ్యంగా ఐటిడిఏ, డి ఆర్ డి ఏ, అటవీ, వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవన మరియు మత్స్యశాఖలు తదితర కలిసి పని చేస్తూ, సుమారు 75 వేల ఎకరాల విస్తీర్ణంలో సమీకృత వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు.అంతేకాకుండా, చిన్న కారు గిరిజన రైతుల అభివృద్ధి కోసం సృజనాత్మక సీడ్ బ్యాంకులు, డెయిరీ ఫార్ములు, పట్టు పరిశ్రమలు మరియు సమీకృత వ్యవసాయ యూనిట్లు స్థాపించడం ద్వారా గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే ఈ సంస్థ ఉద్దేశ్యమని కలెక్టర్ తెలిపారు.ఈ ప్రాజెక్టుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుండి ఆర్థిక సహకారం అందజేయబడుతుందని ఆయన వెల్లడించారు. సంబంధిత విభాగాధికారులు — ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఏపీఎంలు, అలాగే మండల వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖాధికారులు పరస్పర సమన్వయంతో గిరిజన చిన్న మరియు సన్నకారు రైతుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.రైతుల ఆదాయం పెంపు, పేదరిక నిర్మూలన మరియు సుస్థిర జీవనోపాధుల ప్రోత్సాహం ద్వారా జిల్లాలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల దనపు కలెక్టర్ విద్యా చందన, ఏపీవో జనరల్ డేవిడ్ రాజు,వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, జిల్లా లేట్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ డిడి వెంకటేశ్వర్లు , భారత్ రూరల్ లైవ్లిహుడ్ ఫౌండేషన్ ప్రతినిధులు, మరియు ఇతర సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ