తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఐడిఓసి కార్యాలయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో అవగాహన సమావేశం నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఈ సమావేశంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ, న్యాయబద్ధమైన సేవలు మరియు సరైన ధరలకు వస్తువులు అందే విధానాలపై విస్తృతంగా చర్చించారు.మార్చి 15న నిర్వహించే ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వినియోగదారుల హక్కుల పరిరక్షణ, న్యాయబద్ధమైన సేవలు, సరైన ధరలకు వస్తువులు అందే విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించడం అని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిపాలన ప్రజలలో చైతన్యం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు .వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువు లేదా సేవకు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, అందులో ఉన్న వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా లోపాలు, నాణ్యత సమస్యలు లేదా మోసపూరిత ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండటం ద్వారా మాత్రమే సురక్షితమైన కొనుగోలు సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.జిల్లా ప్రజలు బాధ్యతాయుత వినియోగదారులుగా మారి, తమ హక్కులను కాపాడుకోవాలని, అలాగే ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడు తన హక్కులను తెలుసుకొని, బాధ్యతాయుతంగా వస్తువులు మరియు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మోసపూరిత లావాదేవీలను నివారించేందుకు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు.వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తగిన న్యాయం పొందవచ్చని, వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండటం ద్వారా సురక్షితమైన కొనుగోలు సాధ్యమవుతుందని అన్నారు .ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్ సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ