Tuesday, 28 July 2026 04:54:52 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అమ్మ మాట అంగన్వాడి బాట ను విజయవంతం చేయాలి జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనీనా

Date : 09 June 2025 09:06 PM Views : 670

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం (09.జూన్): ఈనెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరగబోయే "అమ్మ మాట అంగనవాడి బాట" కార్యక్రమంలో అంగనవాడి టీచర్ల నుండి సిడిపిఓల వరకు క్షేత్రస్థాయిలో భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేని సోమవారం క్షేత్రస్థాయి సిబ్బందితో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేనినా మాట్లాడుతూ ముందుగా అంగన్వాడి కేంద్రాలను అహలోదకరమైన వాతావరణంలో ఉండే విధంగా చూసుకొని పెరటి తోటలు పచ్చదనంపై శ్రద్ధ పెట్టి మొదటి రోజు వచ్చే పిల్లల తల్లితండ్రులతో అంగన్వాడి కేంద్రాలలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసుకొని ఫోటో దిగే విధంగా చర్యలు తీసుకోని, కార్పొరేట్ విద్యాసంస్థలకు అతీతంగా విద్యా బోధన అందిస్తున్న విధానం పై తల్లితండ్రులకు అవగాహన కల్పిస్తూ, అంగన్వాడి కేంద్రాల శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని కోరారు.మూడు సంవత్సరాల పైబడిన పిల్లలను చేర్పించే విధంగా గ్రామ మరియు పట్టణ స్థాయిలో స్వయం సహాయక గ్రూప్ సభ్యులు పిల్లల తల్లితండ్రులచే అవగాహన ర్యాలీలు నిర్వహించాలని, తదుపరి "స్వచ్ అంగనవాడి"లో భాగంగా అంగన్వాడి కేంద్రాలను శుభ్రపరచుకొని అంగన్వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులకు పోషక విలు అంగనవాడి కేంద్రాలలో పోషణ వాటికలు ఏర్పాటు చేసి అంగన్వాడి కేంద్రాలకు వచ్చే పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పోషకాహార విలువలు పెంపొందించే విధంగా అవగాహన కల్పించాలని, అంగనవాడి కేంద్రాలలో బోధిస్తున్న పూర్వ ప్రాథమిక విద్యపై తల్లితండ్రులకు వివరిస్తూ అదేవిధంగా క్రీడా నైపుణ్యతతో కూడిన విద్యను ఏ విధంగా అనుసరించాలో తెలియపరచాల్సిన మెటీరియల్ను అంగన్వాడి కేంద్రాలలో ఉండే విధంగా చూసుకుంటూ, గ్రామా పట్టణాలలో ఉన్న ప్రతి ఒక్క అంగనవాడి కేంద్రాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించి అట్టి కార్యక్రమానికి పిల్లల యొక్క తల్లితండ్రులు హాజరయ్యే విధంగా చూసుకోవాలని ఈ యొక్క సామూహిక అక్షరాభ్యాసానికి ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. అంగన్వాడి కేంద్రాలలో పిల్లలు ఎవరైతే శారీరకంగా దృఢంగా ఉండి క్రమం తప్పకుండా హాజరవుతూ విద్యాభ్యాసంలో ముందంజలో ఉన్న తల్లితండ్రులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలని, అంగన్వాడి కేంద్రాలలో మౌలిక సదుపాయాలు అయినటువంటి విద్యుత్ సరఫరా నీటి సరఫరా, ప్రీ స్కూల్ కిట్, ఇప్పటికే సిద్ధంగా ఉంచామని, త్రుచా తప్పకుండా అంగన్వాడి కేంద్రాలలో పిల్లల ఎత్తు బరువులు క్రమం తప్పకుండా చూస్తూ వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు పై తల్లితండ్రులకు వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అప్లికేషన్లలో నమోదు చేస్తూ పోషణ లోపం లేకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్క అంగన్వాడి టీచర్ పై ఉందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన :ఇందిరమ్మ అమృతం" పథకం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన జిల్లాలో లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని ఎవరైతే అంగన్వాడి కేంద్రాలలో 14 నుండి 18 సంవత్సరాల మధ్య నమోదైనటువంటి కిశోర బాలికలకు క్రమం తప్పకుండా అందజేస్తూ రక్తహీనత రహిత తెలంగాణ కోసం పాటుపడాలని కోరారు. గర్భిణీలు బాలింతలు చిన్నారులకు అంగనవాడి కేంద్రాలు అందించే పౌష్టికాహారం విలువలు తెలియజేస్తూ అంగన్వాడీ కేంద్రాలలోని వాటిని వినియోగించుకోవడం వల్ల కలిగే లాభాలు తెలియజేస్తూ, విధిగా కిశోర బాలికలకు అనేమియా బారిన పడకుండా వైద్య సిబ్బంది సహకారంతో రక్త పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రంలోనే అత్యధిక ప్రాజెక్టులు కలిగిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావున అత్యధికంగా మూడు సంవత్సరాల పైబడిన చిన్నారులందరూ అంగన్వాడి కేంద్రాలు హాజరై విధంగా చొరవ తీసుకొని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు .* అదేవిధంగా రేపు అనగా 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు అంగనవాడి కేంద్రాలలో నిర్వహించాల్సిన కార్యక్రమ వివరాలు వెల్లడించడం జరిగింది. మొదటి రోజున అంగన్వాడి కేంద్రాలకు వచ్చే పిల్లలు మరియు తల్లితండ్రులు సెల్ఫీలు తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని, అంగనవాడి కేంద్ర పరిసరాలలో ఇంకుడు గుంతలతో పాటు పోషణ వాటికలు ఏర్పాటు చేయటం, గ్రామ పట్టణ స్థాయిలో ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు పిల్లల తల్లితండ్రులచే ర్యాలీ నిర్వహించడం, "స్వచ్ అంగనవాడి" లో భాగంగా అంగనవాడి కేంద్రం పరిశుభ్రంగా ఉంచుకొని మౌలిక సదుపాయాలు అన్ని కల్పించాలని, సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించి పూర్వ ప్రాథమిక విద్య పై అవగాహన కల్పించడం, అంగన్వాడి కేంద్రాలలో బోధించే విద్యా విధానంపై తల్లిదండ్రుల అవగాహన కల్పించడం మన లక్ష్యమని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :