Tuesday, 28 July 2026 02:16:09 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం : ఎస్ కె సాబీర్ పాషా

Date : 23 July 2026 05:19 PM Views : 52

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటు హక్కుపై సిపిఐ విస్తృత ప్రచారం ఎస్ఐఆర్ ప్రక్రియపై గడపగడపకూ అవగాహన ఓటర్ జాబితా సవరణపై సిపిఐ ఆటో ప్రచారం ఎస్ఐఆర్ ఫారం అందించకుంటే జరిగే నష్టంపై అవగాహన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలిపారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన బస్తీలు, గ్రామాల్లో ఐదు ప్రచార ఆటోల ద్వారా ఈ మైకు ప్రచారాన్ని రెండో రోజైన గురువారం అయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ఓటర్ల నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలను సరైన వివరాలతో నింపి తిరిగి ఎన్నికల అధికారులకు అందించే బాధ్యతను ప్రతి పౌరుడు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫారాలను సరిగా సమర్పించకుంటే ఎదురయ్యే నష్టాలను, ప్రక్రియ షెడ్యూల్ విశేషాలను మైకుల ద్వారా వీధి వీధినా ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందన్నారు. స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యంలో నియోజకవర్గంలో అన్ని రంగాల్లోనూ శీఘ్రగతిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లు, డ్రెయిన్లు, వంతెనల నిర్మాణం, సంక్షేమ పథకాలు, నిధుల సేకరణ ద్వారా నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం, ఓటు హక్కు నమోదు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు నియోజకవర్గ వ్యాప్తంగా తమ పార్టీ ప్రచారాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :