తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్ నుంచి యెర్రా లింగేష్ బరిలో నిలిచాను. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆశీస్సులతో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ భాష నేతృత్వంలో 26 డివిజన్ బీ ఫామ్ లింగేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ అన్ని మున్సిపల్ డివిజన్లలో సిపిఐ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయని, ప్రజల మద్దతు తో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన సిపిఐ అభ్యర్థులు గెలవబోతున్నారని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎర్రజెండా రెపరెపరాడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ