Tuesday, 28 July 2026 05:10:39 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో డిజిటైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి.

Date : 06 July 2026 06:30 PM Views : 65

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ఇందులో భాగంగా డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, సంబంధిత అధికారులతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ జూన్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభించామని, ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు. పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లు పూర్తి చేసి తిరిగి అందించిన వెంటనే సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) యాప్‌లో డిజిటైజేషన్ చేపట్టాలని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారాల్లో వివరాల నమోదుకు వాలంటీర్ల సేవలను వినియోగించుకుని ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. డిజిటైజేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అనంతరం పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపట్టి, ప్రతి పోలింగ్ కేంద్రంలో నిర్దేశిత పరిమితికి మించి ఓటర్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో తప్పుడు సమాచారం సమర్పించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజిటైజేషన్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులకు సూపర్వైజర్లు, వాలంటీర్లు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌ను నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ కార్యక్రమ పురోగతిని సమీక్షిస్తున్నామని, జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ సమావేశం లో సంబంధిత శాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :