Tuesday, 28 July 2026 08:02:21 PM
# కాకర్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (PD) పనిచేస్తున్న చింతలపూడి యుగంధర్ మృతి. # అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వేను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. కార్పొరేషన్ మేనేజర్ కి వినతి పత్రాన్ని అందించిన మునిగడప. # ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు. # విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం – నిత్యావసర సరుకులు, దుస్తులు, సోలార్ లైట్లు పంపిణీ.

Date : 18 July 2026 07:02 PM Views : 84

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ తరఫున నీలాద్రిపేట, గండి, అశ్వాపురంపాడు, గుత్తికోయ గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులతో , చీరలు, సోలార్ విద్యుత్ లైట్లు, మహిళా అవసర వస్తువులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన సహాయం అందించేందుకు పోలీస్ శాఖ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.అనంతరం గ్రామస్తులకు మద్యపానం, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించి వారి విద్యను కొనసాగించేలా తల్లిదండ్రులు సహకరించాలని అవగాహన కల్పించారు. గ్రామాల్లో శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏడుల్లా బయ్యారం సీఐ వి. వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు, రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ సేవకులు భూసారపు రమేష్‌, పోలీస్ సిబ్బంది, సభ్యులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :