Tuesday, 28 July 2026 04:20:45 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కార్పొరేట్ల కోసమే లేబర్ కోడ్ లు, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

Date : 29 November 2025 04:52 PM Views : 199

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం సింగరేణి: కార్మికుల హక్కులను కాలరాస్తూ శ్రామిక రంగాన్ని దేశ,విదేశీ పెట్టుబడిదారులకు బలవంతంగా అప్పగించేందుకు దోపిడీ శక్తులకు ఎదురులేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.శనివారం పార్టీ శ్రేణులతో కలిసి సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదురుగా ప్లకార్డులతో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ కార్మికులు అనేక త్యాగాలతో సాధించిన కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దుచేసి కార్పొరేట్ పెద్దల లాభాలకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేసిందని,కార్పొరేట్ వ్యక్తులకు ఊడిగం చేసేలా,కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరిస్తుందని విమర్శించారు.బ్రిటిష్ పాలనలో అంబేద్కర్ 14 గంటల పని దినాన్ని ఎనిమిది గంటలకు కుదించారని అటువంటి చట్టాలను మార్చి కార్మికుల మీద ఎక్కువ పని గంటల ఒత్తిడి తీసుకొస్తుందని,కార్మికవర్గం పోరాడి సాధించిన లేబర్ చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో లేబర్ కోడ్ లను అమలు చేయడం సరైందికాదన్నారు.కార్మిక వర్గంపై మోడీ వివక్ష వీడాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటీవల తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోతు వీరునాయక్, అసెంబ్లీ అధ్యక్షులు నాగుల రవికుమార్, గజ్జల శంకర్,భూక్యా శంకర్, మూడు భద్రి తదితరులు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :