తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాది ప్రజా ప్రభుత్వం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రం లో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా అధికారుల యంత్రాంగం. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి వాకాటి శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జిల్లా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు గిరిజనులు సాగుచేస్తున్న ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లోకి ఫారెస్ట్, పోలీసు అధికారులు వెళ్లొద్దు, గిరిజన రైతులకు 12,600 కోట్లతో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం కింద సోలార్ పంపుసెట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్పు, ఉద్యాన పంటలు ఉచితంగా అందజేస్తున్నాం, మహిళా సంఘాల ద్వారా చేప పిల్లల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం, యూరియా కొరత లేదు డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా చేస్తున్నాం, ఇందిరమ్మ ఇళ్లకు ₹22,500 కోట్లు – మొదటి దశలో 6.5 లక్షల ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ – 85% గ్రామీణ కుటుంబాలకు లాభం, ఆరోగ్యశ్రీ పరిమితి ₹10 లక్షలు – ఇబ్బందులుంటే కలెక్టర్లను సంప్రదించండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ₹6,880Cr RTCకి చెల్లింపు, వన మహోత్సవంలో నాటిన మొక్కలపై పూర్తి వివరాలు సమర్పించండి, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు – 25 ఎకరాల్లో నిర్మాణం. వర్షాకాలంలో వరద పరిస్థితులు.. అప్రమత్తత, ప్రజలకు అందించాల్సిన సహాయక చర్యలు, సంక్షేమ పథకాలు, ఇతర అత్యవసర సదుపాయాల కల్పనపై ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కంట్రోల్ రూమ్‌లు వర్షాకాలం ముగిసే వరకు కొనసాగించాలని, ప్రజల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ