Tuesday, 28 July 2026 03:27:45 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్–2026 ఆవిష్కరణ.

Date : 27 February 2026 08:08 PM Views : 275

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్–2026ను శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ మరియు సంఘం అసోసియేట్ అధ్యక్షులు గొట్టిముక్కుల మహేందర్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ నార్త్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆపరేషనల్ సర్కిల్ కార్యాలయం, లక్ష్మీదేవిపల్లి వద్ద నిర్వహించబడింది. ఈ సందర్భంగా గొట్టిముక్కుల మహేందర్ మాట్లాడుతూ, ఉద్యోగులు సేవాభావంతో విధులు నిర్వర్తిస్తూ సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. పరస్పర సహకారంతో పనిచేసి నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా కృషి చేయాలని సూచించారు. సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలిచే కార్యక్రమాలు చేపట్టి అందరి ప్రశంసలు పొందాలని అన్నారు .జిల్లా అధ్యక్షులు అనంతుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, సంఘం తరఫున తోటి ఉద్యోగులు, పేద విద్యార్థులు మరియు ఆర్థికంగా వెనుకబడిన పద్మశాలి కుటుంబాలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కూడా సంఘం ద్వారా అనేక మంది లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఉత్తమ విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేయడం, అవార్డులు పొందిన ఉత్తమ ఉద్యోగులను సత్కరించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర కార్యాలయం మరియు అన్ని జిల్లా కార్యాలయాల్లో వివాహ సేవా కేంద్రాలు నిర్వహిస్తున్నామని వివరించారు. సభ్యుల సహకారంతోనే ఈ సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు . హైదరాబాద్‌లో సంఘానికి స్వంత కార్యాలయ భవనం ఉండి, సేవా కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దూలం నట్రాజ్, ఆర్గనైజేషనల్ కార్యదర్శి పసునూతి వెంకటేశ్వర్లు, కోశాధికారి పుట్ట లింగమూర్తి, ఉపాధ్యక్షులు వేముల మురళి, కొండి పద్మజ, సంయుక్త కార్యదర్శి పోరండ్ల శ్రీనివాసరావు, ఈసీ సభ్యులు దిగిదారి రాము, అంకం సంతోష్ తదితరులు మరియు ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :