తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వరదలు, అటవీ ప్రమాదాల నియంత్రణపై ఎన్‌డిఎంఏ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్.జిల్లాలో వరదలు, అటవీ ప్రాంతాలలో సంభవించే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి, విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్‌ల నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.గురువారం జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఏ) ఆధ్వర్యంలో వరదలు, అటవీ ప్రమాదాల నియంత్రణపై జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్‌తో కలిసి ఐడీఓసీ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్‌డిఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బహాల్ మాట్లాడుతూ, జిల్లాల్లో వరదలు, అటవీ అగ్నిప్రమాదాలు లేదా ఇతర విపత్తులు సంభవించిన సమయంలో అధికార యంత్రాంగం వేగంగా, సమన్వయంతో స్పందించేందుకు ముందస్తు సిద్ధత ఎంతో అవసరమని తెలిపారు. ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా విపత్తుల నిర్వహణకు సంబంధించిన మాక్ ఎక్సర్సైజ్‌లు నిర్వహించనున్నట్లు వెల్లడిస్తూ, అందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే సమీక్షించాలని సూచించారు.ఇటీవల వాతావరణ మార్పుల ప్రభావంతో తక్కువ సమయంలోనే భారీ వర్షాలు కురిసి ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయని, అగ్నిప్రమాదాల వల్ల అటవీ ప్రాంతాలు నష్టపోతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం, పునరావాసం, పునరుద్ధరణ చర్యలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే అటవీ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల సమయంలో పాటించాల్సిన ప్రామాణిక విధానాలపై (ఎస్‌ఓపీ) స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి శాఖలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు.సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులతో మాట్లాడుతూ, గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు సంభవించినప్పుడు జిల్లాలో చేపడుతున్న ముందస్తు, తక్షణ చర్యలను వివరించారు. వరదల అంచనా విధానం, ముందస్తు హెచ్చరికల జారీ, కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, పునరావాస కేంద్రాల నిర్వహణ, లోతట్టు ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార చర్యలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సూచనలు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వరదలు, అటవీ ప్రమాదాల సమయంలో అధికార యంత్రాంగం సమన్వయంతో స్పందించేలా సమగ్ర మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, సీపీఓ సంజీవరావు, మిషన్ భగీరథ అధికారి తిరుమలేష్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, ఆర్ అండ్ బి శాఖ ఈఈ నాగేశ్వరరావు, డి సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ