తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం సమీపంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు హార్టికల్చర్ కళాశాలను అశ్వారావుపేటకు తీసుకొచ్చినట్లు తెలిపారు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావించి నిరంతర కృషి ఫలితంగానే ఈ కళాశాల మంజూరు సాధ్యమైందన్నారు.ఈ హార్టికల్చర్ కళాశాల ప్రారంభోత్సవం రేపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఘనంగా జరగనుందని తెలిపారు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల రైతులు వ్యవసాయ అధికారులు వ్యవసాయ నిపుణులు హాజరుకానున్నారని చెప్పారు.అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి ఆధునిక సాగు విధానాలు రైతుల ఆదాయ వృద్ధికి సంబంధించిన అంశాలపై రేపు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు హార్టికల్చర్ కళాశాల ఏర్పాటుతో అశ్వారావుపేట ప్రాంత యువతకు నాణ్యమైన వ్యవసాయ విద్య అందుబాటులోకి రావడంతో పాటు రైతులకు సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువ అవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రైతు ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ