తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ జెండాను ఆవిష్కరించి,జిల్లా ప్రజలు,పోలీసు అధికారులు మరియు సిబ్బందికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం 08.30 గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయం నందు జిల్లా ఎస్పి రోహిత్ రాజు ఐపిఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి,అధికారులు సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు మరియు సిబ్బందికి 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.మాతృభూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి బ్రిటిష్ వారితో పోరాడి మనకు సమకూర్చిపెట్టిన ఈ స్వాతంత్ర్య భారతదేశం నేటితో 78 వసంతాలను పూర్తి చేసుకుందని,ఈ సందర్భంగా ఆ మహానీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ పండుగలు సమాజానికి మన వంతు సేవలను ఏ విధంగా అందజేయాలో గుర్తు చేస్తాయని అన్నారు.పోలీస్ అధికారులు,సిబ్బంది పూర్తి బాధ్యతతో పనిచేయాలని,పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతిఒక్కరిని సమానంగా చూడటం,ప్రతి బాధితుడికి న్యాయం చేయగలిగినప్పుడే మనం సాధించుకున్న స్వాతంత్ర్య దేశానికి సార్థకత అని అన్నారు.భిన్న భాషలు,భిన్న జాతులు,భిన్న మతాల కలయిక మన భారత దేశం అని,ఇన్ని విభిన్న సంస్కృతి,సాంప్రధాయలున్న వ్యక్తులు లేదా సమూహాల మధ్య సామరస్యం మరియు ఐక్యత భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుందని,భారతీయులుగా పుట్టినందుకు మనందరం గర్వపడాలన్నారు.ప్రతిఒక్కరూ తమ పనిని మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్లాలని,ప్రజలు పోలీస్ శాఖ నుండి ఆశిస్తున్న అంచనాలను అందుకోవాలని,మన విధులను అంకితభావంతో నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామీ,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,ఎస్బి ఇన్స్పెక్టర్లు సీ.హెచ్ శ్రీనివాస్,ఇ.శ్రీనివాస్ డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,కార్యాలయ ఏఓ మంజ్యా నాయక్ మరియు సీఐలు,ఆర్ఐలు,ఎస్సైలు ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ