Tuesday, 28 July 2026 01:10:28 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జూలూరుపాడు ఉప మార్కెట్ నందు దళారీల దందా

Date : 30 October 2024 07:36 PM Views : 940

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 30 (తెలుగు వెలుగు) జూలూరుపాడు పత్తి మార్కెట్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ పత్తి రైతుల ఆవేదన. సీసీఐ కేంద్రం ద్వారా పత్తి కొనుగోలు జరపాలని, క్వింటాల్ పత్తికి 10వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్. జూలూరుపాడు పత్తి మార్కెట్ కు వస్తే సరైన ధరలు లేక దళారీల చేతిలో దగా పడుతున్నామనితరుగు పేరుతో, పత్తి నాణ్యత లేదంటూ రకరకాల సాకులు చెబుతూ ధరలు తగ్గిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత వారం రోజులుగా జూలూరుపాడు పత్తి మార్కెట్ కు రోజుకు సుమారు 5 వేల క్వింటాళ్లకు పైగా పత్తి వస్తున్నది. పండుగ రోజులు కావడంతో రైతులు తమ అవసరాలకు పత్తిని విక్రయిస్తున్న నేపథ్యంలో రైతుల బలహీనతను ఆసరాగా చేసుకొని దళారులు సిండికేట్ అయి తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేస్తున్నారు.మరోవైపు పత్తితీతలు ముమ్మరం కావడంతో, రైతులు తమ కుటుంబ అవసరాలకు కోసం తెల్లబంగారాన్ని విక్రయించేందుకు మార్కెట్ కి తీసుకొస్తున్నారు. మార్కెట్లో జెండా పాట క్వింటాకు 6600 రూపాయలు కాగా, ఆ తర్వాత క్వింటా 5,800 నుంచి 5,200 రూపాయల ధరకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.క్వింటా పత్తి తీయడానికి కూలీలకు 1500, మార్కెట్ కు తరలించేందుకు రవాణాకు వెయ్యి రూపాయలు అవుతుంటే,ఇక్కడ సరైన మద్దతు ధర లేకపోవడం వల్ల తాము తీవ్రంగానష్టపోతున్నామని, మార్కెట్కు తెచ్చిన పత్తిని తిరిగి తీసుకువెళ్లలేక, దళారీలు అడిగిన రేటుకే అమ్మాల్సిన పరిస్థితి వస్తుందని, కూలీలకు, దళారుల కోసమే తాము వ్యవసాయం చేస్తున్నట్లుగా ఉందని,రైతుకు మిగిలేది ఏమీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, క్వింటాలుకు పదివేల రూపాయలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు..

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :