Tuesday, 28 July 2026 10:57:27 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.

Date : 15 April 2026 06:42 PM Views : 226

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతలా భావించాలి : ఎస్పీ రోహిత్ రాజు.అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో Arrive-Alive కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహనా కార్యక్రమం అశ్వారావుపేటలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు “అరైవ్ ఎలైవ్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు,స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మున్సిపల్ పాలకమండలి సభ్యులు,అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం అత్యవసరమని అన్నారు.మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు.మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని,హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు.కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.అనంతరం ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, “అరైవ్ ఎలైవ్” కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించడం అని తెలిపారు.ముఖ్యంగా యువతలో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన పెంపొందించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు.చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరిస్తూ,ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు పాఠశాల స్థాయిలో వక్తృత్వ పోటీలు నిర్వహించగా అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,ఎస్పీ రోహిత్ రాజు,మున్సిపల్ చైర్మన్ శశికళ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.అనంతరం రోడ్లపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి,వాటి ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా అధికారులు,ప్రజలు కలిసి రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ,వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు,మున్సిపల్ కమిషనర్ నాగరాజు,అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, ఎస్సై యాయాతి రాజు, అదనపు ఎస్ఐ అఖిల, ఎంపీడీవో అప్పారావు, మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు,సర్పంచులు, ఉప సర్పంచులు,అంగన్వాడి కార్యకర్తలు, వివోఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :